logo

విద్యార్థినులతో అనుచిత ప్రవర్తన.. ఆకతాయికి దేహశుద్ధి

కాశీబుగ్గ-పలాస జంట పట్టణాల్లో ఆకతాయిల వల్ల పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 08 Dec 2022 05:32 IST

ఆకతాయిని మందలిస్తున్న స్థానికులు

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: కాశీబుగ్గ-పలాస జంట పట్టణాల్లో ఆకతాయిల వల్ల పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం సాయంత్రం కాశీబుగ్గ ఉన్నత పాఠశాల విడిచిపెట్టిన తర్వాత పలువురు విద్యార్థినులు తమ గ్రామాలకు వెళ్లేందుకు సమీపంలో వ్యానులు, ఆటోల వద్దకు వచ్చారు. అదే సమయంలో అక్కడున్న ఓ వ్యక్తి వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో డ్రైవర్లు, స్థానికులు దేహశుద్ధి చేశారు. విద్యార్థినులు పాఠశాలలకు వెళ్లి, వచ్చే సమయాల్లో ఆయా విద్యాసంస్థల వద్ద ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. దీనిపై పోలీసులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని