logo

చిలకపాలెం టోల్‌గేట్‌ ఎత్తివేత

ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై  టోల్‌గేట్‌ కార్యకలాపాలు బుధవారం అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తున్నట్లు పేర్కొంటూ ఎన్‌హెచ్‌ఏఐ పీడీ పి.శివశంకర్‌ ఉత్తర్వులు జారీచేశారు.

Published : 08 Dec 2022 05:32 IST

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై  టోల్‌గేట్‌ కార్యకలాపాలు బుధవారం అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తున్నట్లు పేర్కొంటూ ఎన్‌హెచ్‌ఏఐ పీడీ పి.శివశంకర్‌ ఉత్తర్వులు జారీచేశారు. 60 కిలోమీటర్ల పరిధిలో ఒకటికి మించి టోల్‌ వసూలు కేంద్రాలు ఉంటే ఎత్తివేయాలని ఇటీవల కేంద్ర ఉపరితల రవాణాశాఖమంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన ప్రకటించిన విషయం  తెలిసిందే. జాతీయరహదారి విస్తరణలో భాగంగా 2007లో చిలకపాలెంలో టోల్‌గేట్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ 107 మంది వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. రోజుకు సరాసరి రూ.22 లక్షల టోల్‌ వసూలయ్యేదని నిర్వాహకులు తెలియజేశారు. ఈ నిర్ణయంతో స్థానికంగా పనిచేస్తున్న వారంతా రోడ్డున పడతారని సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి పి.తేజేశ్వరరావు తెలిపారు. మడపాం, నాతవలస టోల్‌గేట్‌ల వద్ద వీరిని సర్దుబాటు చేసి న్యాయం చేయాలని కోరుతూ గురువారం ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని