logo

2024లో జనసేన జెండా ఎగరాలి

జిల్లాలోని సమస్యలపై నిరంతర పోరాటాలు చేయాలని, 2024 ఎన్నికల్లో జనసేన జెండా ఎగిరేలా కష్టపడాలని పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ(పీఏసీ) ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Updated : 10 Dec 2022 04:24 IST

పార్టీ శ్రేణులకు నాదెండ్ల మనోహర్‌ దిశానిర్దేశం

మాట్లాడుతున్న నాదెండ్ల మనోహర్‌, వేదికపై పార్టీ నాయకులు

అరసవల్లి, న్యూస్‌టుడే: జిల్లాలోని సమస్యలపై నిరంతర పోరాటాలు చేయాలని, 2024 ఎన్నికల్లో జనసేన జెండా ఎగిరేలా కష్టపడాలని పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ(పీఏసీ) ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నాలుగురోజుల పాటు ఇక్కడే ఉండి అన్ని నియోజవర్గాల నాయకులతో సమీక్షలు నిర్వహించేందుకుగాను శుక్రవారం ఆయన శ్రీకాకుళం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ పరమైన విషయాలను, ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు వచ్చినట్లు చెప్పారు. విశాఖలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అనేక సమస్యలను కార్యకర్తలు దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. జిల్లాలో సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నట్లు వివరించారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడేవారని గుర్తిస్తామని హామీ ఇచ్చారు. 12న రణస్థలంలో జరిగే యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. గ్లాస్‌ గుర్తుపై తప్పనిసరిగా ఓట్లు పడాలని సూచించారు. అ సందర్భంగా కొందరు కార్యకర్తలు తమ పార్టీకి సంబంధించిన సమాచారం తెలియడం లేదనే సమస్య ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇకపై వాట్సప్‌ గ్రూపులకు కేంద్ర కార్యాలయం నుంచి సంక్షిప్త సమాచారాలు అందుతాయని భరోసా ఇచ్చారు. పార్టీ జిల్లా నాయకులు గేదెల చైతన్య, వెంకీ పట్నాయక్‌, ఉదయ్‌, విశ్వక్సేన్‌, కాంతిశ్రీ, రామ్మోహన్‌, కోరాడ సర్వేశ్వరరావు, సాయి, గురుప్రసాద్‌, బాబాజీ, సిద్ధయ్య, కిరణ్‌, ప్రవీణ్‌, కామేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని