logo

30, 31 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె

బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ నెల 30, 31 తేదీల్లో సమ్మె చేయనున్నట్లు యూఎఫ్‌బీయూ జిల్లా కన్వీనర్‌ కె.సి.హెచ్‌.వెంకటరమణ పేర్కొన్నారు.

Published : 21 Jan 2023 06:06 IST

ఎస్‌బీఐ ప్రధానశాఖ వద్ద ఉద్యోగుల ఆందోళన

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ నెల 30, 31 తేదీల్లో సమ్మె చేయనున్నట్లు యూఎఫ్‌బీయూ జిల్లా కన్వీనర్‌ కె.సి.హెచ్‌.వెంకటరమణ పేర్కొన్నారు. శ్రీకాకుళం ఎస్‌బీఐ ప్రధాన శాఖ వద్ద శుక్రవారం జరిగిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని, పింఛను, వేతన సవరణ చేయాలనే ప్రధాన డిమాండ్లతో సమ్మెకు వెళ్తున్నట్లు చెప్పారు. యూఎఫ్‌బీయూ మరో శాఖ ఆధ్వర్యంలో నగరంలోని యూనియన్‌ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం వద్ద సంఘ నాయకురాలు జి.కరుణ, గిరిధర్‌ నాయక్‌ల ఆధ్వర్యంలోనూ ఆందోళన చేపట్టారు.

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని