logo

సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలతోనే చరిత్ర

సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాల మేళవింపే చరిత్రగా మారిందని, కవులు, కళాకారులతోనే దాని మనుగడ సాగుతోందని వక్తలు పేర్కొన్నారు.

Published : 22 Jan 2023 04:57 IST

ఉత్తరాంధ్ర రచయితల సభలో వక్తలు

మాట్లాడుతున్న గిరిబాబు, వేదికపై సాహితీవేత్తలు

పలాస, న్యూస్‌టుడే: సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాల మేళవింపే చరిత్రగా మారిందని, కవులు, కళాకారులతోనే దాని మనుగడ సాగుతోందని వక్తలు పేర్కొన్నారు. ఉద్దానం సాహితీ, సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర రచయితల మహాసభలు శనివారం కాశీబుగ్గలో ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం అధ్యక్షుడు బళ్ల గిరిబాబు మాట్లాడుతూ సమాజంలో రచనలు బతికున్నంత వరకు విద్యావ్యవస్థ సక్రమమార్గంలో పయనిస్తుందన్నారు. మధ్యాహ్నం జరిగిన సదస్సులో ‘ఉత్తరాంధ్ర నాటక కళారూపాలు’పై ప్రముఖ సాహితీవేత్తలు, పరిశోధకులు జయధీర్‌ తిరుమలరావు మాట్లాడారు. ప్రజా కళలు ఉత్తరాంధ్ర ప్రత్యేకత అని అంతరించకముందే వాటిని డాక్యుమెంట్‌ చేసి బతికించాలని కోరారు. రంగస్థల కళాకారుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు చిట్టి వెంకటరావు, సినీగేయ రచయిత అందెశ్రీ, ఉద్దానం సాహితీ వేదిక అధ్యక్షుడు ఎల్‌.రుద్రమూర్తి, కార్యనిర్వాహక అధ్యక్షుడు కుమార్‌ నాయక్‌, ఉపాధ్యక్షుడు కె.వినోద్‌, ప్రధాన కార్యదర్శి సీహెచ్‌.జగదీశ్‌, అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యురాలు డి.పద్మజ, వజ్జ బాబూరావు, పీవీ సతీష్‌, ఎం.భాస్కరరావు, డి.తాతారావు, పీకే శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని