logo

ఉద్దానం వాసులంతా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి

ఉద్దానం ప్రాంతానికి చెందిన ప్రతి వ్యక్తి విధిగా కిడ్నీ వ్యాధి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా సూచించారు

Published : 22 Jan 2023 05:08 IST

మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

శ్రీకాకుళం లీగల్‌ న్యూస్‌టుడే: ఉద్దానం ప్రాంతానికి చెందిన ప్రతి వ్యక్తి విధిగా కిడ్నీ వ్యాధి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా సూచించారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతాన్ని ఎన్నో ఏళ్లుగా పీడిస్తోన్న సమస్య పరిష్కారానికి సామాజిక, మానవతా దృక్పథంతో కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పారు. ఇప్పటివరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉద్దానంలోని నాలుగు మండలాల్లో మూడు వైద్య శిబిరాలు, మూడు న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. వ్యాధిగ్రస్థులు మందులు క్రమం తప్పకుండా వాడాలన్నారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని