logo

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మరొకరి మృతి

అలికాం బత్తిలి రహదారిపై కొండరాగోలు సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల్లో మరొకరు మృతి చెందారు.

Published : 26 Jan 2023 06:19 IST

జోగారావు (పాత చిత్రం)

హిరమండలం, న్యూస్‌టుడే: అలికాం బత్తిలి రహదారిపై కొండరాగోలు సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల్లో మరొకరు మృతి చెందారు. ఘటనలో పెద్దగూడ పంచాయతీలోని కొండూరు ముఠాకు చెందిన సవర కురమయ్య(45) అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన సవర జోగారావు(36), సవర శిమ్మయ్యలను మెరుగైన వైద్య చికిత్సలకు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం వేకువ జామున జోగారావు మృతి చెందాడు. ఈయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

గిరిజనుల ఆందోళన.. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ కొండూరుముఠా, కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట మండలాల గిరిజనులు హిరమండలం పోలీసు స్టేషన్‌ ఎదుట ఏబీ రహదారిపై బైఠాయించారు. రహదారికి అడ్డంగా విద్యుత్తు స్తంభం వేసి వాహనాల రాకపోకలను కొంత సమయం అడ్డుకున్నారు. నిరసన తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమానులను అదుపులోకి తీసుకోవాలని, మృతులు, క్షతగాత్రుడి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేలా చూసి న్యాయం చేయాలని కోరారు. కొత్తూరు సీఐ వి.వేణుగోపాలరావు, హిరమండలం ఎస్సై జి.నారాయణస్వామిలు గిరిజనులతో మాట్లాడి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రోడ్డుపై నుంచి పక్కకు తప్పుకున్నారు. అనంతరం గిరిజన గ్రామాలకు చెందిన కొంత మంది పోలీసులతో చర్చలు జరిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని