logo

ఓటు హక్కు వినియోగంలో వృద్ధులే ఆదర్శం: కలెక్టర్‌

ఓటు హక్కు వినియోగంలో యువత వృద్ధులను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలి నుంచి బాపూజీ కళామందిరం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.

Published : 26 Jan 2023 06:19 IST

దివ్యాంగ ఓటరును సత్కరిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఓటు హక్కు వినియోగంలో యువత వృద్ధులను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలి నుంచి బాపూజీ కళామందిరం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జేసీ ఎం.నవీన్‌ ప్రారంభించారు. అనంతరం బాపూజీ కళామందిరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ మాట్లాడుతూ సీనియర్‌ సిటిజన్లు ఎంతో బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారన్నారు. ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జేసీ ఎం.నవీన్‌ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం సీనియర్‌ సిటిజన్‌, దివ్యాంగ ఓటర్లను సత్కరించారు. కొత్తగా ఓటరుగా నమోదైన యువతకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఉత్తమ సేవలందించిన బీఎల్‌వోలను కలెక్టర్‌ అభినందించారు. అనంతరం ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీవో బి.శాంతి, తహసీల్దార్‌ ఎన్‌.వెంకటరావు, ఎన్నికల విభాగం ఉప తహసీలార్లు చక్రవర్తి, ఎస్‌.మురళీ, వీఆర్‌వోలు, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్‌ కె.శ్రీరాములు, పి.జయరాం, డ్వామా ఏపీˆవో కె.వి.అప్పలనాయుడు, డీపీˆఆర్‌వో బాలమాన్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీలో పాల్గొన్న జేసీ ఎం.నవీన్‌, ఆర్డీవో బి.శాంతి, తదితరులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని