logo

గణతంత్ర వేడుకలకు ముస్తాబు

జిల్లాలో గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు) మైదానంలో వేడుకలు జరగనున్నాయి. గురువారం ఉదయం 9 గంటలకు కలెక్టర్‌ జెండా ఆవిష్కరించేందుకు మైదానానికి చేరాల్సి ఉంటుంది.

Updated : 26 Jan 2023 07:11 IST

జాతీయ జెండా ఎగురవేయనున్న కలెక్టరు

కళాశాల మైదానంలో ఏర్పాట్లు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాలో గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు) మైదానంలో వేడుకలు జరగనున్నాయి. గురువారం ఉదయం 9 గంటలకు కలెక్టర్‌ జెండా ఆవిష్కరించేందుకు మైదానానికి చేరాల్సి ఉంటుంది. ముందుగా కలెక్టర్‌ను క్యాంపు కార్యాలయం నుంచి పోలీసులు మర్యాద పూర్వకంగా తీసుకొస్తారు. అనంతరం జెండా ఆవిష్కరణ ఉంటుంది. తరువాత సాయుధదళాల గౌరవ వందనం, స్వాతంత్య్ర సమరయోధులను కలవడం, దేశ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ పథకాలను వివరించే శకటాలు, స్టాళ్ల ప్రదర్శన ఉంటాయి. వీటన్నింటికీ సంబంధించి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, జేసీ ఎం.నవీన్‌ బుధవారం సాయంత్రం మైదానంలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు.

221 మందికి ప్రశంసా పత్రాలు

గణతంత్ర వేడుకల సందర్భంగా ఏటా ఉత్తమ సేవలందించిన అధికారులకు గుర్తించి ప్రశంసా పత్రాలను అందజేస్తారు. ఈసారి జిల్లా వ్యాప్తంగా 72 ప్రభుత్వశాఖలకు 216 మందికి, 5 స్వచ్ఛంద సంస్థలకుగాను అయిదుగురికి ప్రశంసా పత్రాలు ఇచ్చేందుకు ఎంపిక చేశారు. వీరిలో జిల్లా అధికారులు మెప్మా పీడీ ఎం.కిరణ్‌కుమార్‌, నెడ్‌ క్యాప్‌ జిల్లా మేనేజరు ఐ.వి.సుబ్రహ్మణ్యం, మెప్మా పీడీ జి.వి.చిట్టిరాజు, వంశధార ఎస్‌ఈ డి.తిరుమలరావు, జిల్లా రిజిస్ట్రార్‌ కె.మన్మధ రావు, తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని