logo

మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలి

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు పిలుపునిచ్చారు.

Published : 27 Jan 2023 04:55 IST

ర్యాలీగా వెళుతున్న రైతు సంఘాల నేతలు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు పిలుపునిచ్చారు. రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతులను మోసగించిందని విమర్శించారు. పండించిన పంటకు స్వామినాథన్‌ కమిషన్‌ సూచనల ప్రకారం మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలని, కేరళ తరహా రుణవిమోచన చట్టం తీసుకురావాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో వివిధ రైతు సంఘాల నాయకులు బి.శ్రీరామూర్తి, గోవర్ధనరావు, సత్యం, సూరయ్య, అప్పారావు, తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని