logo

రేపటి నుంచి నాలుగు రోజులు బ్యాంకుల మూత

బ్యాంకులు శనివారం నుంచి నాలుగు రోజులపాటు మూతపడనున్నాయి. ప్రతి రెండు, నాలుగో శనివారం సెలవు కాబట్టి ఆరోజు పని చేయవు.

Published : 27 Jan 2023 04:55 IST

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: బ్యాంకులు శనివారం నుంచి నాలుగు రోజులపాటు మూతపడనున్నాయి. ప్రతి రెండు, నాలుగో శనివారం సెలవు కాబట్టి ఆరోజు పని చేయవు. ఆదివారమూ తెరుచుకోవు. ఈనెల 30, 31వ తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమస్యల పరిష్కారం కోరుతూ రెండు రోజుల పాటు సమ్మెకు దిగనున్నాయి. ఈ కారణంగా సోమ, మంగళవారం కూడా బ్యాంకులు పని చేయని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏమైనా బ్యాంకు సంబంధిత పనులుంటే శుక్రవారమే చేసుకోవడం మంచిదని అధికారులు చెబుతున్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని