దివ్వరూపం.. నిత్య తేజం..!
ఆరోగ్యం భాస్కరాధిత్యాత్ అంటారు.. అంటే సమస్త జీవకోటి ఆరోగ్యం సూర్యుని ఆధీనంలో ఉంటుందని అర్థం. నిత్యం భానుడిని కొలిచేవారికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.
న్యూస్‌టుడే, అరసవల్లి
ఆరోగ్యం భాస్కరాధిత్యాత్ అంటారు.. అంటే సమస్త జీవకోటి ఆరోగ్యం సూర్యుని ఆధీనంలో ఉంటుందని అర్థం. నిత్యం భానుడిని కొలిచేవారికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఏటా మాఘమాసంలో అరసవల్లి క్షేత్రంలో రథసప్తమి వేడుక నిర్వహిస్తారు. ముందురోజు అర్ధరాత్రి నుంచి సాయంత్రం వరకు ఆలయంలోని ఉషాపద్మినీఛాయా సమేతుడైన సూర్యభగవానుడు నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ సమయంలో జరిగే క్షీరాభిషేకాన్ని చూసి తరించేందుకు భక్తులు పోటెత్తుతారు. ఈ ఏడాది కూడా ఆ తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో అరసవల్లి క్షేత్రం, ఆదిత్యుడి వైభవం, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం రండి..
మంత్రముగ్దుల్ని చేసే అరుణశిల..
అరసవల్లి క్షేత్రంలో ఆరడుగుల ఎత్తు, సుమారు రెండున్నర అడుగుల వెడల్పుతో ఏకశిలతో స్వామి దివ్యరూపం భక్తులకు కనువిందు చేస్తుంది. ఈ అరుణశిలను చూసి వారు మంత్రముగ్దులవుతారు. దీనికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ విగ్రహాన్ని దేవేంద్రుడు ప్రతిష్ఠించినట్టుగా శిలా శాసనాలు తెలియజేస్తున్నాయి.
పేరు వచ్చిందిలా..
ఈ క్షేత్రానికి వచ్చి పూజలు, అభిషేకాలు, సూర్యనమస్కారాలు చేస్తే కోర్కెలు ఫలించడంతో పాటు భక్తులు ఎంతో ఆనందంగా తమ ఇళ్లకు వెళ్తారని, అందుకే హర్షవల్లి అని నామం కలిగిందని ప్రతీతి. అనంతర కాలంలో అది అరసవల్లిగా రూపాంతరం చెందిందని పురాణాలు చెబుతున్నాయి.
ఏడాదిలో రెండుసార్లు కిరణస్పర్శ
ఏడాదిలో రెండుసార్లు సూర్యకిరణాలు గర్భగుడిలోని మూలవిరాట్టును తాకేలా నిర్మించడం ఈ ఆలయ ప్రత్యేకత. అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం గుండా తొలి కిరణాలు స్వామి పాదాల నుంచి మొదలై శిరస్సు వరకు వెళ్తాయి. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు స్థానికులతో పాటు పొరుగు ప్రాంతాల నుంచి సైతం భక్తులు పెద్దఎత్తున వస్తుంటారు. ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ఏటా మార్చి 9, 10, అక్టోబరు 1, 2 తేదీల్లో ఈ దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి.
వైజయంతి రథం: వైజయంతి రథం అంటే సప్త అశ్వాలతో కూడిన వాహనం. స్వామి దీనిపై నిల్చుని ఉంటారు. ఏడు గుర్రాలు ఏడు రంగుల్లో ఉంటాయి. స్వామి సామవేద ప్రియులు కావడంతో ఈ అశ్వాలను సరిగమపదని అనే సప్తస్వరాలుగా భావిస్తారు. ఈ రథం పది వేల యోజనాల పొడవు, పది వేల అడుగుల వెడల్పు ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. రథానికి ఒక చక్రం, ఐదు ఆకులు, మూడు నాభులు, ఆరు చక్రపు అంచులుంటాయి.
12 మాసాలు.. 12 పేర్లు
తల్లి కోరిక మేరకు దేవతల శత్రువులైన రాక్షసులను ఓడించినందున స్వామిని ఆదిత్యుడని పిలుస్తారు. ఈయన ఎరుపు వర్ణం కలవాడు. రథంలో ఒకే చక్రం ఉంటుంది. దీన్ని సంవత్సరం అంటారు. ఈ రథంలో పన్నెండు మాసాలు, ఆరు రుతువులు, మూడునాభులు ఉంటాయి. ఇదే కాలచక్రమని కూడా అంటారు. అందుకే సూర్యభగవానుడిని పన్నెండు మాసాల్లో 12 పేర్ల (మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్య గర్భ, మారీచి, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కర)తో ఆరాధిస్తారు.
అన్నింటికీ ఆధారం సూర్యుడే..
ఖగోళశాస్త్రం ప్రకారం సూర్యుడు వేల నక్షత్రాల మధ్య ఓ మహానక్షత్రం. హైడ్రోజన్, హీలియంలతో నిండిన వాయుగోళం. ఆ గురుత్వాకర్షణ శక్తి కారణంగానే భూమి సహా వివిధ గ్రహాలు సూర్యభ్రమణం చేస్తున్నాయి. మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే.
ఆయురారోగ్యాలు పొందాలి...
సూర్యుడిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలిగి ఆరోగ్యవంతులవుతారు. రథసప్తమి రోజున స్వామివారికి పాలాభిషేకం చేస్తాం. నల్లటి విగ్రహం మీద తెల్లని పాలు పడే దృశ్యం వీక్షిస్తే ఒళ్లు పులకరించిపోతుంది. ఆ దివ్యమూర్తిని దర్శించి అందరూ ఆయురారోగ్యాలు పొందాలి. ప్రతి నెలా మాససంక్రమణం రోజున కూడా క్షీరాభిషేకం చేసి భక్తులకు నిజరూప దర్శనం కల్పిస్తున్నాం. - ఇప్పిలి నగేష్‌శర్మ, అర్చకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India vs Australia: ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్నారు.. కంగారూల ఎదుట భారీ లక్ష్యం
-
Kangana Ranaut: మహేశ్ బాబు సినిమాలో నటించలేదన్న బాధ ఉంది: కంగనా రనౌత్
-
Chandrababu Arrest: అక్టోబరు 5వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు
-
Ukraine : యుద్ధం ముగిసిన వెంటనే అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు పెట్టుబడులు : జెలెన్ స్కీ
-
Chandrababu Arrest: మహిళా శక్తి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. విశాఖలో ఉద్రిక్తత
-
Apple Devices: యాపిల్ యూజర్లకు కేంద్రం భద్రతాపరమైన అలర్ట్