logo

ఇంధనం అయిపోవడంతో పడిపోయిందట!

సంతబొమ్మాళి మండలం భావనపాడు తీరంలో మత్స్యకారులకు పట్టుబడిన జెట్ డ్రోన్‌ను భావనపాడు మెరైన్‌ సీఐ దేవుళ్లు, ఏఎస్‌ఐ ఎంఆర్‌కే రెడ్డి గురువారం స్వాధీనం చేసుకున్నారు.

Updated : 03 Feb 2023 12:44 IST

నౌపడ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఉంచిన డ్రోన్‌

సంతబొమ్మాళి మండలం భావనపాడు తీరంలో మత్స్యకారులకు పట్టుబడిన జెట్ డ్రోన్‌ను భావనపాడు మెరైన్‌ సీఐ దేవుళ్లు, ఏఎస్‌ఐ ఎంఆర్‌కే రెడ్డి గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రం గోపాల్‌పూర్‌లో జనవరి 28న యూజర్‌ ట్రయల్‌లో భాగంగా ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మిసైల్‌ నుంచి ఈ డ్రోన్‌ను కొట్టేందుకు ప్రయత్నించగా ఈ ప్రయోగం విఫలమై కూలిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇది ఆర్మీ ఆయుధ వ్యవస్థ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉద్దేశించిందన్నారు. ఈ నమూనా డ్రోన్‌ను 45 నిమిషాల్లో వైమానిక వాహనం ద్వారా ధ్వంసం చేయాలని.. అయితే ఇంతలోనే జెట్‌ డ్రోన్‌లో ఇంధనం అయిపోవడంతో భావనపాడు సముద్ర తీరంలో అది పడిపోయిందని వివరించారు. వీటిని అప్పగించాలని సంస్థ ప్రతినిధులు కోరినప్పటికీ డీఆర్‌డీఏ అధికారుల సమక్షంలో అందజేస్తామని పోలీసులు చెప్పారు. నౌపడ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఉన్న డ్రోన్‌ను ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు తిరిగి భావనపాడు మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

న్యూస్‌టుడే, సంతబొమ్మాళి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని