logo

శ్రమకు తగిన వేతనం ఇస్తున్నారా?

జి.సిగడాం మండలం వాండ్రంగి పంచాయతీలో గురువారం జాతీయ బృందం పర్యటించింది.

Published : 03 Feb 2023 03:05 IST

మాట్లాడుతున్న కేంద్ర బృంద సభ్యుడు సత్యరంజన్‌ రౌత్‌, చిత్రంలో ఇతర అధికారులు

జి.సిగడాం, న్యూస్‌టుడే: జి.సిగడాం మండలం వాండ్రంగి పంచాయతీలో గురువారం జాతీయ బృందం పర్యటించింది. దిల్లీ నుంచి వచ్చిన గిరిజా  శంకర్‌ పాఢి, సత్య రంజన్‌ రౌత్‌ జిల్లా అధికారులతో కలిసి గ్రామంలో ఉపాధి హామీ పథకం వేతనదారులతో గురువారం సమావేశం నిర్వహించారు. శ్రమకు తగ్గ వేతనం ఇస్తున్నారా? అని వారిని ఆరా తీశారు. ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాండ్రంగి పంచాయతీలో కేంద్ర ప్రభుత్వ నిధులను ఏఏ పనులకు ఖర్చు చేశారనే వివరాలను ఎంపీడీవో శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శి గౌరీశంకర్‌ నుంచి సేకరించారు. దస్త్రాలు తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. డ్వామా పీడీ జీవీ చిట్టిరాజు, డీపీవో డి.రవికుమార్‌, జిల్లా పరిషత్‌ సీఈవో ఆర్‌.వెంకటరమణ, డీఆర్‌డీఏ పీడీ డి.విద్యాసాగర్‌, సర్పంచి నాగరాజు, ఎంపీటీసీ సభ్యురాలు బూరాడ శ్రీదేవి, ఉపాధి ఏపీవో సత్యనారాయణ పాల్గొన్నారు.  


9 వరకు పర్యటన

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకం ప్రాథమిక లక్ష్యాలు క్షేత్రస్థాయిలో ఎంతమేరకు అమలవుతున్నాయో పరిశీలించి నివేదికలను అందించేందుకు జిల్లాకు వచ్చినట్లు జాతీయ స్థాయి పరిశీలనా బృంద సభ్యులు గిరిజాశంకర్‌ పాఢి, సత్యరంజన్‌ రౌత్‌ తెలిపారు. గురువారం జిల్లాకు వచ్చినవారు జిల్లా కేంద్రంలోని డ్వామా కార్యాలయంలో పీడీ చిట్టిరాజుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 9వ తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తామని చెప్పారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో పరిపాలనాధికారి ప్రసాదరావు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు