ఆర్టీసీలో వజ్రాల్లాంటి చోదకులు
ఆర్టీసీలో వజ్రాల్లాంటి డ్రైవర్లున్నారని, ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం అందిస్తున్నారని జిల్లా రవాణాశాఖాధికారి శ్రీదేవి కొనియాడారు.
డ్రైవరు ఆర్.ఎన్.రావుకు ప్రశంసాపత్రం అందజేస్తున్న ఈడీ రవికుమార్
అరసవల్లి, న్యూస్‌టుడే: ఆర్టీసీలో వజ్రాల్లాంటి డ్రైవర్లున్నారని, ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం అందిస్తున్నారని జిల్లా రవాణాశాఖాధికారి శ్రీదేవి కొనియాడారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో-2 ఆవరణలో 34వ రహదారి భద్రత వారోత్సవాలు గురువారం జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నైపుణ్యం కలిగిన డ్రైవర్లు ఆర్టీసీలో ఉన్నారన్నారు. ప్రతి ఒక్కరు భద్రత సూక్తి, సమయపాలన పాటించాలని సూచించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ చాలామంది డ్రైవర్లు రహదారి మధ్యలో బస్సు నిలిపివేస్తున్నారని, పక్కకు ఆపితే ట్రాఫిక్‌జామ్ అవ్వకుండా ఉంటుందని తెలిపారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన వారికి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరావు, జిల్లా ప్రజారవాణాధికారి విజయ్‌కుమార్, డిపో మేనేజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉత్తమ డ్రైవర్లు వీరే..: శ్రీకాకుళం ఒకటో డిపో: ఆర్.ఎన్.రావు, బీవీఆర్ మూర్తి, పి.వి.రావ్, ఎన్.పురుషోత్తం, వై.జి.రావు, డి.వి.రాజు
రెండో డిపో: కె.రమణ, యు.ఎ.రావు, కేఎస్‌పీ రావు టెక్కలి: కె.జె.రావు, జె.ఎల్.నారాయణ, డి.ఎం.రావు పలాస: యు.కె.రావు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Crime News
కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని
-
Ap-top-news News
ఎమ్మెల్యే అనిల్ ఫ్లెక్సీకి పోలీసుల పహారా