‘వైకాపా ప్రభుత్వానికి నూకలు చెల్లనున్నాయి’
వైకాపా ప్రభుత్వానికి నూకలు చెల్లనున్నాయని, 2024 ఎన్నికలే అవకాశంగా ప్రజలు ఎదురు చూస్తున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష పేర్కొన్నారు.
మాట్లాడుతున్న గౌతు శిరీష, చిత్రంలో ఇతర నాయకులు
మందస, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వానికి నూకలు చెల్లనున్నాయని, 2024 ఎన్నికలే అవకాశంగా ప్రజలు ఎదురు చూస్తున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష పేర్కొన్నారు. మందస మండలం తాళ్లగురంటి పంచాయతీ గ్రామాల్లో గురువారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దకోష్టలో ఆ పంచాయతీ పరిధిలోని పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వ అరాచకాలను గుర్తెరగాలని ప్రజలను కోరారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్న జనసందోహాన్ని చూసి సీఎంకు వణుకు పుట్టిందని, అందుకే అడ్డుకున్నారని విమర్శించారు. సీఎం అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఎన్నికల కోసం ఓర్పు, సహనంతో ఉన్నారన్నారు. పార్టీ మండల నాయకులు రుక్మిణీ బిశ్వాళ, రాజాన ఝాన్సీ, డి.తాతారావు, లింగరాజు, నవీన్, లచ్చయ్య, లక్ష్మణరావు, రుద్రయ్య, దుర్యోధన తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Amritpal Singh: నేను పోలీసులకు లొంగిపోవడం లేదు.. త్వరలోనే ప్రజల ముందుకొస్తా: అమృత్పాల్ సింగ్
-
Sports News
IPL 2023: ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా హ్యారీ బ్రూక్ నిలుస్తాడు: ఇంగ్లాండ్ మాజీ పేసర్
-
India News
Rajasthan: ‘గహ్లోత్జీ వారి మొర ఆలకించండి’.. ప్రైవేట్ వైద్యులకు సచిన్ పైలట్ మద్దతు!
-
Viral-videos News
Viral Video: చెన్నై అమ్మాయిల సరదా పని..! బకెట్లు.. డబ్బాలు.. కుక్కర్లతో కాలేజీకి..
-
Sports News
IND vs PAK: వన్డే ప్రపంచ కప్ 2023.. భారత్లో ఆడేది లేదన్న పాక్.. తటస్థ వేదికల్లోనే నిర్వహించాలట!
-
World News
Espionage: రష్యాలో అమెరికన్ జర్నలిస్టు అరెస్టు.. ప్రచ్ఛన్న యుద్ధానంతరం మొదటిసారి!