logo

ఖేలో ఇండియా పోటీల్లో స్వర్ణపతకం

ఖేలో ఇండియా పోటీల్లో సిక్కోలుకు చెందిన జూడో క్రీడాకారిణి కడపల సౌమ్య స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. మధ్యప్రదేశ్‌లో శుక్రవారం జరిగిన రెండో ఖేలో ఇండియా జాతీయస్థాయి లీగ్‌ కమ్‌ ర్యాంకింగ్‌ జూడో పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరఫున పాల్గొని విజేతగా నిలించింది.

Published : 04 Feb 2023 04:12 IST

కడపల సౌమ్య

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: ఖేలో ఇండియా పోటీల్లో సిక్కోలుకు చెందిన జూడో క్రీడాకారిణి కడపల సౌమ్య స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. మధ్యప్రదేశ్‌లో శుక్రవారం జరిగిన రెండో ఖేలో ఇండియా జాతీయస్థాయి లీగ్‌ కమ్‌ ర్యాంకింగ్‌ జూడో పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరఫున పాల్గొని విజేతగా నిలించింది. తుది పోరులో కె.ఎం.హర్ష(కేరళ)ను చిత్తు చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. గతేడాది దిల్లీలో జరిగిన మొదటి ఖేలో ఇండియా జాతీయస్థాయి లీగ్‌ కమ్‌ ర్యాంకింగ్‌ జూడో పోటీల్లో సౌమ్య రజత పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా క్రీడాకారిణిని సెట్‌శ్రీ సీఈవో బి.వి.ప్రసాదరావు, డీఎస్‌ఏ ముఖ్య శిక్షకురాలు ఎం.మాధురీలత, జూడో సంఘ కార్యనిర్వర్వాహణ కార్యదర్శి పైడి సునీత, శిక్షకుడు పి.ఎస్‌.మణికుమార్‌, జూడో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పులఖండం సూర్యప్రకాశ్‌, ఎం.వి.రమణ, ఒలింపిక్‌ సంఘం ప్రధాన కార్యదర్శి పెంకి సుందరరావు, జూడో సంఘ సభ్యులు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని