logo

రీసర్వే గురించి తెలియకుంటే ఎలా?

గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీసర్వే గురించి తెలియకుంటే ఎలా? వీఆర్వోగా క్షేత్రస్థాయిలో అవగాహన కలిగి ఉండాలి కదా? అని టెక్కలి సబ్‌కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి చిట్టివలస వీఆర్వో పనితీరును ప్రశ్నిస్తూ అతని సస్పెన్షన్‌కు సిఫార్సు చేయాలని అధికారులను ఆదేశించారు.

Published : 04 Feb 2023 04:12 IST

చవితిపేటలో వినతిపత్రాన్ని పరిశీలిస్తున్నసబ్‌కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీసర్వే గురించి తెలియకుంటే ఎలా? వీఆర్వోగా క్షేత్రస్థాయిలో అవగాహన కలిగి ఉండాలి కదా? అని టెక్కలి సబ్‌కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి చిట్టివలస వీఆర్వో పనితీరును ప్రశ్నిస్తూ అతని సస్పెన్షన్‌కు సిఫార్సు చేయాలని అధికారులను ఆదేశించారు. చవితిపేట గ్రామంలో సమస్యల పరిశీలనకొచ్చిన ఆయన శుక్రవారం మండలస్థాయి అధికారులతో మాట్లాడారు. రీసర్వేలో ఎందుకు జాప్యం జరుగుతుందని గ్రామ సర్వేయర్‌ను ప్రశ్నించారు. గ్రామానికి రోడ్డు, మంచినీటి సౌకర్యాలపై సబ్‌కలెక్టర్‌కు పలువురు విజ్ఞప్తి చేశారు.  శ్మశానానికి రహదారి, విద్యుత్తు సౌకర్యం, ఉపాధి పనులు, కాలనీలో బోరు వేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీడీవో ఫణీంద్రకుమార్‌, తహసీల్దార్‌ ఈశ్వరమ్మ, సర్పంచి వెంకటరమణ ఉన్నారు. అనంతరం గ్రామంలో సమావేశం నిర్వహించారు. దుప్పలపాడు పంచాయతీ కొప్పలపేట గ్రామంలో ఆక్రమణలతో పాటు కస్తూరిపాడు గ్రామంలో అసైన్డ్‌ భూముల్ని పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని