logo

‘పాలకుల అన్యాయాలను ప్రశ్నిస్తాం’

ప్రత్యేక హోదా నినాదంతో ప్రారంభమైన విద్యార్థి, యువజన సంఘాల సమరయాత్ర ఇచ్ఛాపురంలో శనివారం సాయంత్రం ముగిసింది.

Published : 05 Feb 2023 03:04 IST

శ్రీకాకుళంలో జరిగిన సభలో నాయకుల ఐక్యతారాగం

ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల, కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రత్యేక హోదా నినాదంతో ప్రారంభమైన విద్యార్థి, యువజన సంఘాల సమరయాత్ర ఇచ్ఛాపురంలో శనివారం సాయంత్రం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో విద్యార్థులు, వివిధ సంఘాల నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం బస్టాండు కూడలిలో జరిగిన సభలో పలువురు మాట్లాడారు. ‘రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిందే.. ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి యువతకు ఉపాధి లభిస్తుంది. అందుకే తమ పోరాటం.ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు, కడప ఉక్కు పరిశ్రమ స్థాపన, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి’ అని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ అన్నారు. సమితి జిల్లా అధ్యక్షుడు నర్సునాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గోవిందరావు పాల్గొన్నారు.

* రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం చేతకాకపోతే రాష్ట్ర ఎంపీలు రాజీనామా చేయాలని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నక్కి లెనిన్‌బాబు అన్నారు. తొలుత యాత్ర ఎచ్చెర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్‌ ఆడిటోరియం సమీపంలో సభ నిర్వహించారు. దాన్ని పోలీసులు అడుకున్నారు. మైక్‌లు, షామియానాలు వేయకూడదని చెప్పడంతో విద్యార్థి, యువజన సంఘాల ఐకాస నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని