logo

ఈ దారుణం చూడండి..!

పోలాకి మండల పరిధిలోని తీరప్రాంత గ్రామాలైన గుప్పిడిపేట నుంచి గుల్లవానిపేటకు వెళ్లే రోడ్డు తీరిది.. కనీసం సైకిల్‌పై వెళ్లాలన్నా వీలులేని దుస్థితి.

Published : 05 Feb 2023 03:04 IST

న్యూస్‌టుడే, పోలాకి: పోలాకి మండల పరిధిలోని తీరప్రాంత గ్రామాలైన గుప్పిడిపేట నుంచి గుల్లవానిపేటకు వెళ్లే రోడ్డు తీరిది.. కనీసం సైకిల్‌పై వెళ్లాలన్నా వీలులేని దుస్థితి. ఫలితంగా వాహనదారులు తరచూ ప్రమాదాలబారిన పడుతున్నారు. 8 ఏళ్ల కిందట 4 కి.మీ. రోడ్డును రూ.1.30 కోట్లతో నిర్మించారు. నాలుగేళ్ల వరకు బాగానే ఉన్నా ఏడాదిన్నర నుంచి మరీ దారుణంగా దెబ్బతింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం దీన్ని పట్టించుకోవడం లేదు. గ్రామస్థాయి నేతలు అధికారులకు చెప్పినా ప్రయోజనం లేదు. దీనిపై పంచాయతీరాజ్‌ ఏఈ కోదండరావు మాట్లాడుతూ రోడ్డు బాగుచేయడానికి ప్రతిపాదనలు పెట్టామని, నిధులు వస్తే పనులు చేయిస్తామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని