logo

15 రోజుల్లో అన్ని పరీక్షల ఫలితాలు విడుదల

అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ డిగ్రీ, పీజీ విద్యార్థులకు సంబంధించిన అన్ని ఫలితాలు 15 రోజుల్లోగా విడుదల చేస్తామని వర్సిటీ ఉపకులపతి నిమ్మ వెంకటరావు అన్నారు.

Updated : 05 Feb 2023 04:54 IST

విద్యార్థి సమస్యను ఫోన్లో తెలుసుకుంటున్న ఉపకులపతి

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ డిగ్రీ, పీజీ విద్యార్థులకు సంబంధించిన అన్ని ఫలితాలు 15 రోజుల్లోగా విడుదల చేస్తామని వర్సిటీ ఉపకులపతి నిమ్మ వెంకటరావు అన్నారు. విశ్వవిద్యాలయంలో శనివారం డయల్‌ యువర్‌ వర్సిటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులతో సమస్యలపై ఫోన్‌లో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ డిగ్రీ స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్షల పునర్‌మూల్యాంకనం, ప్రథమ సెమిస్టర్‌ ఫలితాలు వారం రోజుల్లో విడుదల చేస్తామన్నారు. డిగ్రీ నాలుగో సెమిస్టర్‌ ఫలితాలు 15 రోజుల్లోగా వెల్లడిస్తామన్నారు. వీటితోపాటు మూడు, ఆరో సెమిస్టర్‌ల పునర్‌ మూల్యాంకన ఫలితాలు కూడా ప్రకటిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ సీహెచ్‌.ఏ.రాజేంద్రప్రసాద్‌, ప్రధానాచార్యులు బిడ్డికి అడ్డయ్య, డీన్‌లు ఎస్‌.ఉదయ్‌భాస్కర్‌, పి.సుజాత, ఎం.అనురాధ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని