logo

88 చెరువుల్లో అమృత్‌ సరోవర్‌ పనులు

ఉపాధిహామీ పథకంలో భాగంగా జిల్లాలో అమృత్‌ సరోవర్‌ పథకం కింద 88 చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు డ్వామా పీడీ జి.వి.చిట్టిరాజు తెలిపారు.

Published : 05 Feb 2023 03:04 IST

కొత్తూరుపేటలో చెరువు పనులను పరిశీలిస్తున్న పీడీ చిట్టిరాజు

లావేరు, న్యూస్‌టుడే: ఉపాధిహామీ పథకంలో భాగంగా జిల్లాలో అమృత్‌ సరోవర్‌ పథకం కింద 88 చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు డ్వామా పీడీ జి.వి.చిట్టిరాజు తెలిపారు. లావేరు మండలం పెద్దకొత్తపల్లి పంచాయతీ కొత్తూరుపేట గ్రామంలో అమృత్‌ సరోవర్‌ పథకం కింద పనులు జరుగుతున్న చెరువును శనివారం ఆయన పరిశీలించారు. 88 చెరువులకుగానూ రూ.7.90 కోట్లు నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. వీటిలో 14 పూర్తికాగా, 57 చోట్ల పనులు జరుగుతున్నాయని తెలిపారు. మరో 17 చెరువుల్లో ప్రారంభించాల్సి ఉందన్నారు. ప్రతి ఒక్కరికి 100 రోజులు పని కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీడీ శైలజ, ఏపీవో సత్యవతి, ఈసీ లెనిన్‌బాబు, సాంకేతిక, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని