logo

ఆధ్యాత్మిక శోభ

జిల్లాలో మాఘపౌర్ణమి సందర్భంగా ఆదివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

Published : 06 Feb 2023 06:17 IST

శ్రీచక్రపురంలో అమ్మవారికి చామంతులతో అభిషేకం

జిల్లాలో మాఘపౌర్ణమి సందర్భంగా ఆదివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. దీంతో పాటు గార మండలం శాలిహుండంపై ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో గత నెల 31 నుంచి నిర్వహిస్తున్న తిరుకల్యాణ మహోత్సవం (భీష్మ ఏకాదశి ఉత్సవం) ముగిసింది. ఎచ్చెర్ల మండలం కుంచాలకూర్మయ్యపేటలోని శ్రీచక్రపురంలో రాజరాజేశ్వరి అమ్మవారికి, మహామేరువుకు లక్ష చామంతులతో అభిషేకం నిర్వహించారు. మహిళలు 1001 శ్రీచక్రాల వద్ద సామూహిక కుంకుమ పూజలు చేశారు. సారవకోట మండలం చీడిపూడిలో కొలువై ఉన్న కల్యాణవెంకటేశ్వరస్వామి చక్రతీర్థ స్నానం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో కొలువుదీర్చి  చీడిపూడి, బుడితి, అవలింగి గ్రామాల్లో ఊరేగించారు. ఆయా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం, అరసవల్లి, గార, సారవకోట, ఎచ్చెర్ల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని