logo

‘సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే’

కాంట్రిబ్యూటరీ పింఛను విధానాన్ని(సీపీఎస్‌) రద్దు చేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర డిమాండు చేశారు.

Published : 06 Feb 2023 06:17 IST

సంకల్ప దీక్షలో పాల్గొన్న యూటీఎఫ్‌ నాయకులు

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: కాంట్రిబ్యూటరీ పింఛను విధానాన్ని(సీపీఎస్‌) రద్దు చేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర డిమాండు చేశారు. ఈ నెల 3న విజయవాడలో చేపట్టిన సంకల్పదీక్షను పోలీసులు భగ్నం చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్జీవో హోం వద్ద నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితుల్లోనూ జీపీఎస్‌ను అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం ప్రసంగిస్తూ ‘మాట తప్పను మడమ తిప్పను’ అని చెప్పిన ముఖ్యమంత్రి సీపీఎస్‌ రద్దు విషయంలో రెండూ చేశారని ఎద్దేవా చేశారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అప్పారావు, ఎస్‌.కిశోర్‌కుమార్‌ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో పాత పింఛన్‌ను పునరుద్ధరిస్తుంటే హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం దారుణమన్నారు. సంఘ నాయకులు వై.ఉమాశంకర్‌, ఎస్‌.నారాయణరావు, రెడ్డి త్రినాథరావు, బి.శంకరరావు, డి.లక్ష్మీనారాయణ, ఎన్‌.శివప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని