logo

మండాది.. శోకసంద్రం

ఆమదాలవలస మండలం మండాది గ్రామం శోకసంద్రంగా మారింది. శనివారం లారీ ఢీకొని గ్రామానికి చెందిన నలుగురు ఉపాధిహామీ కూలీలు మృతిచెందిన విషయం తెలిసిందే.

Published : 06 Feb 2023 06:17 IST

మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: ఆమదాలవలస మండలం మండాది గ్రామం శోకసంద్రంగా మారింది. శనివారం లారీ ఢీకొని గ్రామానికి చెందిన నలుగురు ఉపాధిహామీ కూలీలు మృతిచెందిన విషయం తెలిసిందే. వీరి మృతదేహాలకు ఆదివారం శ్రీకాకుళం సర్వజనాసుపత్రిలో శవపంచనామా చేసి స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పెద్దఎత్తున చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతదేహాలను ఖననం చేశారు. శ్రీనివాసాచార్యులపేట సర్పంచి బొడ్డేపల్లి గౌరీపతి, కట్యాచార్యులపేట ఎంపీటీసీ బొడ్డేపల్లి సుగుణ, భర్త లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీటీసీ గురుగుబెల్లి ప్రభాకరరావు సహాయ సహకారాలు అందించారు. డ్వామా పీడీ జి.వి.చిట్టిరాజు మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా రావాల్సినవన్నీ వచ్చేవిధంగా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు.  

రూ.25 లక్షల పరిహారం చెల్లించాలి: బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరావు సింహాచలం ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఆదివారం ఆయా కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఇప్పటివరకు కనీసం పరామర్శించకపోవడం విచారకరమన్నారు. ప్రమాదం జరిగిన రోజున సమీపంలోని జగ్గుశాస్త్రులపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారన్నారు. ఆసుపత్రికి మృతదేహాలను తరలించిన 24 గంటల వరకూ ఎవరూ పట్టించుకోలేదన్నారు. పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని