logo

కదంతొక్కిన అంగన్‌వాడీలు

అంగన్‌వాడీలు కదం తొక్కారు. కనీస వేతనాలను అమలు చేయాలని, దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండు చేశారు.

Published : 07 Feb 2023 06:09 IST

కలెక్టర్‌ కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

అంగన్‌వాడీలు కదం తొక్కారు. కనీస వేతనాలను అమలు చేయాలని, దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండు చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌కు భారీ ర్యాలీగా తరలివచ్చారు. ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ హాజరును రద్దు చేయాలని, కేంద్రాల్లో వసతులు సమకూర్చాలని, విద్యుత్తు బిల్లులు చెల్లించాలని, టీఏ, డీఏ బకాయిలు ఇవ్వాలని డిమాండు చేశారు. అనేక రకాల యాప్‌లను తీసుకొచ్చి పనిభారం పెంచుతున్నారని, అందుకుతగ్గ వేతనాలు మాత్ర ఇవ్వడం లేదన్నారు. గతంలో ఇచ్చిన చరవాణులు నాసిరకంగా ఉన్నాయని, వాటి స్థానంలో కొత్తవి ఇవ్వాలన్నారు. రాజకీయ వేధింపులు ఆపాలని, ర్యాలీలు, సభలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని కోరారు. అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు సుధ, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
న్యూస్‌టుడే, కలెక్టరేట్‌(శ్రీకాకుళం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు