logo

వినతుల పరిష్కారానికి చర్యలు

జిల్లాపరిషత్తు సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి మొత్తం 193 వినతులు రాగా వీటిని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌తో పాటు జేసీ ఎం.నవీన్‌ స్వీకరించారు. వీటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

Published : 07 Feb 2023 06:21 IST

స్పందనలో కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌

ఫిర్యాదుల విభాగానికి వచ్చిన హిరమండలం మండలం సుభలయ గ్రామానికి చెందిన చిన్నారులతో సర్పంచి రోజారాణి, కుటుంబీకులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాపరిషత్తు సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి మొత్తం 193 వినతులు రాగా వీటిని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌తో పాటు జేసీ ఎం.నవీన్‌ స్వీకరించారు. వీటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
* హిరమండలం మండలం సుభలయ గ్రామానికి చెందిన చిన్నారులు టి.మణి, వేణుల తల్లిదండ్రులు ఇద్దరూ అనారోగ్య కారణాలతో చనిపోయారని, వారికి ప్రభుత్వం నుంచి మంజూరైన ఇంటిపట్టా పునరుద్ధరించాలని సర్పంచి లంక రోజారాణి కలెక్టర్‌ను కోరారు. ఇద్దరు చిన్నారులకు ఎలాంటి ఆధారం లేనందున ప్రత్యేక కేసుగా తీసుకుని న్యాయం చేయాలని విన్నవించారు.  
* కవిటి తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్తు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగేశ్వరరావు కోరారు. బెంతు ఒరియాలకు ఎస్టీ ధ్రువపత్రాలను నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారన్నారు. 9 మందికి ఎస్టీ ధ్రువపత్రాలను ఉద్దేశపూర్వకంగానే ఇచ్చారన్నారు. దీనిపై ఏకసభ్య కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
* ఏపీ ఈపీడీసీఎల్‌లో తనకు లైసెన్సు ఉన్నప్పటికీ కాంట్రాక్టులు ఇవ్వడం లేదని తండేంవలసకు చెందిన ఎస్‌.చినబాబు ఫిర్యాదు చేశారు.  
* ఆమదాలవలస మండలం మందాడి గ్రామానికి చెందిన ఉపాధిహామీ వేతనదారులు ప్రమాదవశాత్తు మరణించారని, ఆయా కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని వ్యవసాయ కార్మిక పంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సింహాచలం కోరారు. దీనికి కలెక్టర్‌ స్పందించి ఇప్పటికే ఈ విషయం పీడీతో మాట్లాడారని, ఒక్కో కుటుంబానికి రూ.7.50 లక్షలు ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్టు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని