logo

కాంగ్రెస్‌ నేతల నిరసన

అదానీ గ్రూప్‌ లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం నగరంలోని ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

Published : 07 Feb 2023 06:21 IST

అదానీ గ్రూప్‌ లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం నగరంలోని ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో బ్యాంకుల జాతీయకరణ, ఎల్‌ఐసీ వంటి సంస్థలను ఏర్పాటు చేయగా.. భాజపా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వరంగ సంస్థలను, వాటి ఆస్తులను ఆర్థికంగా దివాలా తీసేవిధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నిరసనలో డీసీసీ నాయకులు సనపల అన్నాజీరావు, దేశిల్ల గోవింద మల్లిబాబు, అంబటి కృష్ణారావు, పైడి నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.
న్యూస్‌టుడే, పాతశ్రీకాకుళం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని