logo

మల్లన్న తలపాగా ఊరేగింపు

శ్రీశైలం మల్లన్నస్వామి, భ్రమరాంబ అమ్మవారికి మహాశివరాత్రి నాడు అలంకరించే పొందూరు చేనేత వస్త్రాలకు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు

Published : 07 Feb 2023 06:21 IST

శ్రీశైలం మల్లన్నస్వామి, భ్రమరాంబ అమ్మవారికి మహాశివరాత్రి నాడు అలంకరించే పొందూరు చేనేత వస్త్రాలకు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ఏటా ఇక్కడి చేనేత కార్మికులు నియమ నిష్ఠలతో మల్లన్నస్వామికి పాగా, భ్రమరాంబ అమ్మవారికి చీర, విఘ్నేశ్వరుడికి, బసవన్నకు ప్రత్యేక వస్త్రాలు నేసి సమర్పిస్తారు. ఈ ఏడాది లావేటివీధికి చెందిన చేనేత కార్మికుడు బనిశెట్టి వీరాంజనేయులు ఆయా వస్త్రాలు నేశారు. వాటిని శివరాత్రికి శ్రీశైలం ఆలయ అధికారులకు అందజేస్తారు. మల్లన్నస్వామికి 160 మీటర్ల పొడవు, 48 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన పాగా, భ్రమరాంబ అమ్మవారికి 6 మీటర్ల పసుపు అంచు చీర, బసవన్నకు 6 మీటర్ల ఎరుపు అంచు పంచె, గణపతికి 3 మీటర్ల అంచు పంచె నేశారు. ఆయా వస్త్రాలకు ప్రత్యేక పూజల అనంతరం పొందూరు వీధుల్లో ఊరేగించారు.
న్యూస్‌టుడే, పొందూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని