logo

‘ఆశాల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి’

రాష్ట్ర ప్రభుత్వం ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించకుంటే పోరాటం ఉద్ధృతం చేస్తామని ఏపీ ఆశావర్కర్ల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోచమ్మ పేర్కొన్నారు

Updated : 07 Feb 2023 06:34 IST

సమావేశంలో మాట్లాడుతున్న పోచమ్మ

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించకుంటే పోరాటం ఉద్ధృతం చేస్తామని ఏపీ ఆశావర్కర్ల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోచమ్మ పేర్కొన్నారు. యూనియన్‌ జిల్లా 5వ మహాసభలు నగరంలోని యూటీఎఫ్‌ కార్యాలయంలో సోమవారం జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్‌ 5న నిర్వహిస్తున్న ‘చలో దిల్లీ’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ విధానాలను ప్రతిఘటించకపోతే దేశ సంపద అంతా కొందరి పరం అవుతుందన్నారు. ఆశావర్కర్లపై పనిభారం తగ్గించాలని, కనీస వేతనం రూ.26 వేలు చేయాలని డిమాండు చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ కార్మికవర్గం ఏళ్లతరబడి పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 లేబర్‌ కోడ్‌లుగా మార్చారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు చీకటి జీవోలను తీసుకువచ్చిందన్నారు. తక్షణమే వీటిని ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. అనంతరం నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. గౌరవాధ్యక్షురాలిగా కె.నాగమణి, అధ్యక్షురాలిగా డి.ధనలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా జి.అమరావతి, కోశాధికారిగా పి.ధనలక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా పి.కాంతమ్మ, జి.పార్వతి, సీహెచ్‌ లక్ష్మి, సహాయ కార్యదర్శులుగా స్వర్ణలతా పట్నాయక్‌, ఎం.లావణ్య, ప్రేమలతతో పాటు కార్యవర్గ సభ్యులను, కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని