logo

కదం తొక్కిన అంగన్‌వాడీలు

వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు కదంతొక్కారు. చలో విజయవాడకు వెళ్లకుండా అడ్డుకున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధానికి నిరసనగా కలెక్టర్‌ కార్యాలయం ముందు సోమవారం మహాధర్నా నిర్వహించారు.

Updated : 21 Mar 2023 07:10 IST

    ర్యాలీగా వస్తున్న కార్యకర్తలు

న్యూస్‌టుడే, కలెక్టరేట్ (శ్రీకాకుళం)

వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు కదంతొక్కారు. చలో విజయవాడకు వెళ్లకుండా అడ్డుకున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధానికి నిరసనగా కలెక్టర్‌ కార్యాలయం ముందు సోమవారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ సిబ్బందికి సకాలంలో వేతనాలు, బిల్లులు చెల్లించడం లేదన్నారు. తెలంగాణ కంటే అదనంగా రూ.వెయ్యి వేతనాన్ని పెంచుతామని సీఎం హామీ ఇచ్చినా అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయాలన్నారు. రాజకీయ వేధింపులు ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షురాలు కె.నాగమణి, నాయకులు ఎ.సత్యనారాయణ, సూరయ్య, అంగన్‌వాడీ వర్కర్ల సంఘ నాయకులు కె.కల్యాణి, ఎన్‌.హైమవతి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ ముందు బైఠాయించి ధర్నా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని