logo

పేదలకు అండగా గుప్పెడు బియ్యం

పేదలు, అనాథ శరణాలయాలు, నిరాశ్రయ గృహాలకు ఉచితంగా బియ్యం అందించే లక్ష్యంతో జిల్లాలో మెప్మా పరిధిలోని స్వయంశక్తి సంఘాల మహిళలు ప్రతి నెల వారి సమావేశంలో గుప్పెడు బియ్యం అందించడం అభినందనీయమని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అన్నారు.

Published : 21 Mar 2023 05:39 IST

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, జేసీ నవీన్‌, ఇతర అధికారులు

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: పేదలు, అనాథ శరణాలయాలు, నిరాశ్రయ గృహాలకు ఉచితంగా బియ్యం అందించే లక్ష్యంతో జిల్లాలో మెప్మా పరిధిలోని స్వయంశక్తి సంఘాల మహిళలు ప్రతి నెల వారి సమావేశంలో గుప్పెడు బియ్యం అందించడం అభినందనీయమని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘాలకు సంబంధించి గుప్పెడు బియ్యం కార్యక్రమాన్ని జేసీ నవీన్‌తో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉగాది నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుండటం సంతోషంగా ఉందన్నారు. సేవా కార్యక్రమాల్లో మెప్మా పరిధిలోని స్వయంశక్తి సంఘాల సభ్యులు భాగస్వాములు కావడం హర్షణీయమన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, మెప్మా పీడీ ఎం.కిరణ్‌కుమార్‌, డిప్యూటీ కలెక్టర్‌ జయదేవి, డీఆర్‌డీఏ పీడీ విద్యాసాగర్‌, జడ్పీ సీఈవో ఆర్‌.వెంకట్రామన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని