logo

గడువులోగా వినతులు పరిష్కరించాలి: కలెక్టర్‌

స్పందన వినతులు గడువు లోగా పరిష్కరించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఆదేశించారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వినతులు స్వీకరించారు.

Published : 21 Mar 2023 05:39 IST

కలెక్టరేట్(శ్రీకాకుళం), నేరవార్త విభాగం, న్యూస్‌టుడే: స్పందన వినతులు గడువు లోగా పరిష్కరించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఆదేశించారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును 24 గంటల్లో తెరిచి పరిష్కరించడమా, తిరస్కరించడమా అనే అంశంపై వివరణ ఇవ్వాలని, తిరస్కరిస్తే కచ్చితమైన కారణాలు తెలియజేయాలని అధికారులకు సూచించారు. సమస్యలు జవాబుదారీతనంతో పరిష్కరించాలని, స్పందన వినతులపై ప్రతి రోజు అరగంట సమయం కేటాయించాలన్నారు. జేసీ ఎం.నవీన్‌, డీఆర్వో ఎం.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

* జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాధిక ఆధ్వర్యంలో స్పందన జరిగింది. ఇందులో 37 అర్జీలు స్వీకరించారు. బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సీఎంఆర్‌ బియ్యాన్ని వెంటనే తీసుకోవాలని పోలాకి మండలం సుసరాం గ్రామానికి చెందిన రైస్‌ మిల్లు యజమాని టి.భూషణరావు కోరారు. ధాన్యం కొనుగోళ్లలో భాగంగా తమ మిల్లుకు ఇచ్చిన ధాన్యం మిల్లింగ్‌ చేశామని, తన మిల్లులో 261 మెట్రిక్‌ టన్నుల బియ్యం సిద్ధంగా ఉందని, సరకు తరలిస్తేనే మిల్లు ఆడించడానికి వీలు పడుతుందని వినతిపత్రంలో పేర్కొన్నారు.

దేవరాపల్లి నీటివాగు ఆక్రమణకు గురైందని రణస్థలం మండలం వేల్పురాయి గ్రామానికి చెందిన బాలిరామునాయుడు ఫిర్యాదు చేశారు.

అకాల వర్షాలకు మొక్క జొన్న ఇతర పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెదేపా  సీనియర్‌ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని