logo

మూకుమ్మడిగా కట్టేశారు..!

శ్రీకాకుళం నగరంలోని పెద్దపాడు రహదారిలో ఓ బహుళ అంతస్తుకు ఎదురుగా రహదారి పక్కన ఖాళీ స్థలాన్ని కొందరు ఆక్రమించి బడ్డీలు, ఇతర నిర్మాణాలు చేపట్టారు.

Updated : 21 Mar 2023 07:11 IST

రోడ్డును ఆనుకుని ఏర్పాటు చేసిన బడ్డీలు

న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

శ్రీకాకుళం నగరంలోని పెద్దపాడు రహదారిలో ఓ బహుళ అంతస్తుకు ఎదురుగా రహదారి పక్కన ఖాళీ స్థలాన్ని కొందరు ఆక్రమించి బడ్డీలు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. నిత్యం వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే రామలక్ష్మణ కూడలి నుంచి పెద్దపాడు వెళ్లే ఈ మార్గంలో రోజురోజుకూ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ఖాళీ స్థలంలో బడ్డీలు ఏర్పాటు చేయడంతో రహదారి ఇరుకుగా మారుతోంది. ఆయా దుకాణాలకు వచ్చేవారు వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్‌ చేయడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటివి ఎప్పటికప్పుడు గుర్తించి తొలగించాల్సిన స్థానిక వార్డు ప్లానింగ్‌ కార్యదర్శులు తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే అదనుగా భావించి ఒకరిని చూసి మరొకరు ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఆక్రమించేసి బడ్డీలు, ఇతర నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయమై నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు మాట్లాడుతూ రహదారులు, భవనాలశాఖకు చెందిన ఆ మార్గంలో ఆ శాఖ అధికారుల  సమన్వయంతో తక్షణమే ఆక్రమణలు తొలగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాత్రికి రాత్రే వెలిసిన దుకాణాలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని