logo

‘ఉద్యోగ భద్రత కల్పించకుంటే ఆందోళన ఉద్ధృతం’

పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీరింగ్‌ విభాగంలో పని చేస్తున్న సాంకేతిక సహాయకులు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని పీఆర్‌ ఇంజినీరింగ్‌ సాంకేతిక సహాయకుల సంఘం జిల్లా ప్రతినిధి  బి.వి.రమేష్‌ కోరారు.

Published : 21 Mar 2023 05:39 IST

నిరసన తెలుపుతున్న పీఆర్‌ ఇంజినీరింగ్‌ సాంకేతిక సహాయకుల సంఘ ప్రతినిధులు

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీరింగ్‌ విభాగంలో పని చేస్తున్న సాంకేతిక సహాయకులు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని పీఆర్‌ ఇంజినీరింగ్‌ సాంకేతిక సహాయకుల సంఘం జిల్లా ప్రతినిధి  బి.వి.రమేష్‌ కోరారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అపరిష్కృత వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం పీఆర్‌ ఎస్‌ఈ కార్యాలయం వద్ద ఇంజినీరింగ్‌ సాంకేతిక సహాయకులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం, పాలకొండ డివిజన్లలో పని చేస్తున్న వారికి ఏడు నెలలు, టెక్కలి డివిజన్‌లో పని చేస్తున్న వారికి 13 నెలలుగా వేతనాలు అపరిష్కృతంగా ఉన్నా విధులు నిర్వహిస్తున్నామని  ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయలని.. లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈమేరకు పీఆర్‌ ఎస్‌ఈ వి.ఎస్‌.ఎన్‌.మూర్తికి వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ నాయకుడు పి.తిరుపతిరావు, పీఆర్‌ ఇంజినీరింగ్‌ సాంకేతిక సహాయకుల సంఘం జిలఆల నాయకులు టి.గోవింద్‌, వై.ఢిల్లేశ్వరరావు, ఆర్‌.రమణ, రఘు, సీహెచ్‌ అప్పలనాయుడు, జి.అచ్యుతరావు, బి.కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని