logo

‘ప్రజాస్వామ్యంలో చీకటి రోజు’

అసెంబ్లీలో సోమవారం నాటి ఘటనతో ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా మిగిలిపోతుందని తెదేపా రాష్ట్రప్రధాన కార్యదర్శి గౌతు శిరీష విమర్శించారు.

Published : 21 Mar 2023 05:39 IST

పలాస తెదేపా కార్యాలయంలో మాట్లాడుతున్న గౌతు శిరీష

పలాస, న్యూస్‌టుడే: అసెంబ్లీలో సోమవారం నాటి ఘటనతో ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా మిగిలిపోతుందని తెదేపా రాష్ట్రప్రధాన కార్యదర్శి గౌతు శిరీష విమర్శించారు. పలాస తెదేపా కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. జీవో నంబరు ఒకటిపై చర్చపెట్టాలంటూ శాసనసభలో కోరిన తెదేపా నాయకులపై రౌడీలా దాడికి పాల్పడటం సిగ్గుమాలిన చర్య అన్నారు. దళిత శాసనసభ్యుడు బాలవీరాంజనేయస్వామిపై జరిగిన దాడిని అందరూ ఖండించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని వైకాపా నాయకులు ఈ నెల 23న జరిగే ఎన్నికల్లో సైతం ఓటమి భయంతోనే దాడులకు దిగుతున్నారన్నారు. స్పీకర్‌ స్థానంలో అసమర్థులు ఉండటం వల్లే ఇటువంటి దాడులు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, పార్లమెంట్‌ నియోజకవర్గ  ప్రధాన కార్యదర్శి పి.విఠల్‌, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గాలి కృష్ణారావు,  బి.నాగరాజు, ఎస్‌.మోహనరావు, కె.లక్ష్మణ్‌కుమార్‌, డి.సంతోష్‌, ఎల్‌.రుద్రయ్య, ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు