logo

అదుపుతప్పిన కంటైనర్‌

మడపాం టోల్‌గేట్‌ సమీపంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ సమస్య ఎక్కువగా ఉంది. టోల్‌గేట్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్య శీర్షికన ‘ఈనాడు’లో సోమవారం కథనం వెలువడింది.

Published : 21 Mar 2023 05:39 IST

మడపాం టోల్‌గేట్‌ సమీపంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ సమస్య ఎక్కువగా ఉంది. టోల్‌గేట్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్య శీర్షికన ‘ఈనాడు’లో సోమవారం కథనం వెలువడింది. విశాలమైన రహదారి ఉన్నా టోల్‌గేట్‌కు అటు, ఇటు వాహనాలు అడ్డదిడ్డంగా నిలిపివేయడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం ఓ కంటైనర్‌ లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ ప్రాంతంలో వాహనాలు నిలిచిపోవడంతో రోడ్డు కనిపించక ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మడపాం టోల్‌గేట్‌ వద్ద ప్రోలీసులు టాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

న్యూస్‌టుడే, నరసన్నపేట


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు