logo

పిడుగుపాటే ప్రాణం తీసిందా?

మండల పరిధి పైడిభీమవరంలోని ఒక లాడ్జిలో బస చేసిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన నిద్రకు ఉపక్రమించిన మంచం పక్కన ఛార్జింగ్‌ పెట్టిన సెల్‌ఫోన్‌ నుంచి విద్యుత్తు ప్రసరించి మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Published : 21 Mar 2023 05:39 IST

లాడ్జిలో గుజరాత్‌ వాసి మృతి

రణస్థలం, న్యూస్‌టుడే: మండల పరిధి పైడిభీమవరంలోని ఒక లాడ్జిలో బస చేసిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన నిద్రకు ఉపక్రమించిన మంచం పక్కన ఛార్జింగ్‌ పెట్టిన సెల్‌ఫోన్‌ నుంచి విద్యుత్తు ప్రసరించి మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌కు చెందిన సోలంకి గోవింద్‌బాయ్‌ (53) డాక్టర్‌ రెడ్డీస్‌ పరిశ్రమలో లిఫ్ట్‌లు పర్యవేక్షిస్తుంటారు. ఆయన అప్పుడప్పుడు ఇక్కడి వచ్చి లిఫ్ట్‌లు తనిఖీ చేసి వెళ్తుంటారు. ఈ నెల 13న వచ్చి లాడ్జిలో దిగారు. ఆదివారం ఉదయం సిబ్బంది గది తలుపు కొట్టినా తీయలేదు. సోమవారం మద్యాహ్నం రెడ్డీస్‌ పరిశ్రమ నుంచి గోవింద్‌బాయ్‌కు ఫోన్‌ చేస్తున్నా పని చేయకపోవడంతో లాడ్జికి ఫోను చేశారు. సిబ్బంది తలుపు కొట్టగా తీయలేదు. వెనుక   కిటికీలో నుంచి పరిశీలించగా దుర్వాసన వస్తోంది. వెంటనే పోలీసులు, ఆయన పని చేసే గుత్తేదారుకు సమాచారమిచ్చారు. జేఆర్‌పురం ఎస్సై రాజేష్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి గోవింద్‌బాయ్‌ నిద్రించారని.. పిడుగుపాటుకు సెల్‌ఫోన్‌ నుంచి విద్యుత్తు ప్రసరించి మృతి చెందారని చెప్పారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు