logo

అమ్మ సంబరానికి శుభరాట నేడు

పదేళ్ల విరామం తరువాత నిర్వహించనున్న స్వేచ్ఛావతి అమ్మవారి మహా సంబరాల్లో తొలి అంకమైన శుభరాట స్థాపనకు రంగం సిద్ధమైంది.

Published : 27 Mar 2023 05:16 IST

పూజలందుకున్న కురాసిని అమ్మవారు

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: పదేళ్ల విరామం తరువాత నిర్వహించనున్న స్వేచ్ఛావతి అమ్మవారి మహా సంబరాల్లో తొలి అంకమైన శుభరాట స్థాపనకు రంగం సిద్ధమైంది. ఇందుకు అవసరమైన కార్యక్రమాలను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చేపట్టారు. ఒడిశాలోని కురాసిని అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారి అనుమతిని పుష్పరూపంలో అందుకుని, ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్న వెదురుకు పూజలు చేసి సేకరించారు. అది ఇచ్ఛాపురంలోని సురంగి రాజావారి కోటకు చేరుకుంది. స్వేచ్ఛావతి అమ్మవారికి సోమవారం తెల్లవారుజామున అభిషేకం, సింధూరమర్థనం, పూజలు చేయనున్నారు. భక్తులు కోటకు చేరుకుని శుభరాటను తిరువీధిగా అమ్మవారి ఆలయానికి చేరుస్తారు. అది స్థాపించే ఉప్పల వీధి ఉత్సవ మండపం వద్ద వేదిక సిద్ధం చేశారు. సుమారు పది అడుగుల లోతున గుంత తవ్వారు. అందులో పూజలు చేసి నవధాన్యాలు, నవరత్నాలు, యంత్రాలు వేసి ఆపై రాటను స్థాపించనున్నారు. వెదురుతో పాటు వేప, నేరేడు దుంగలను ముహూర్త వేళ 9.40 గంటలకు స్థాపిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. వచ్చే నెల 17 నుంచి స్వేచ్ఛావతి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నెల రోజుల పాటు ఇవి కొనసాగుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని