logo

ఘనంగా అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లాలో అన్ని మండలాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు వేడుకలు చేశారు.

Published : 27 Mar 2023 05:16 IST

టెక్కలిలో కేక్‌ కోస్తున్న తెదేపా నేతలు

టెక్కలి, న్యూస్‌టుడే : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లాలో అన్ని మండలాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు వేడుకలు చేశారు. టెక్కలి తెదేపా కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరిరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు, తెదేపా జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి అతిథులుగా పాల్గొన్నారు. తెలుగు యువత మండల అధ్యక్షుడు కోళ్ల కామేష్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా, 47 మంది అభిమానులు రక్తదానం చేశారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని