logo

‘గిరిజనుల జీవితాలతో ఆడుకుంటున్న జగన్‌’

ఆదివాసీల జీవితాలతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆడుకుంటున్నారని, బోయ, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చే నిర్ణయమే అందుకు నిదర్శనమని పలువురు గిరిజన నాయకులు వ్యాఖ్యానించారు.

Published : 27 Mar 2023 05:16 IST

నిరసన తెలుపుతున్న ఆదివాసీ నాయకులు

మందస, న్యూస్‌టుడే: ఆదివాసీల జీవితాలతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆడుకుంటున్నారని, బోయ, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చే నిర్ణయమే అందుకు నిదర్శనమని పలువురు గిరిజన నాయకులు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా మందసలో ఆదివారం ఆదివాసీ వికాస పరిషత్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. శాసనసభలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోకపోతే అధికార పార్టీ నాయకులు ఓటమి చవిచూస్తారన్నారు. భవిష్యత్తులో ఏ ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చినా గిరిజనులు వైకాపాను బహిష్కరిస్తారని స్పష్టం చేశారు. రాష్ట్ర గిరిజన ఉపాధ్యాయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు జగన్నాయకులు, ఐకాస జిల్లా అధ్యక్షుడు రాంబాబు, నాయకులు జగన్‌, డొంబురు, గణేశ్వరరావు, సోములయ్య, దండాశి, జైరాం, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని