logo

‘తిరుమలలో గంజాయి పట్టుబడటం సిగ్గుచేటు’

తిరుమలలో గంజాయి పట్టుబడటం సిగ్గుచేటని, ఇది చూస్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలన ఎలా ఉందో అర్థమవుతుందని తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు.

Published : 27 Mar 2023 05:16 IST

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: తిరుమలలో గంజాయి పట్టుబడటం సిగ్గుచేటని, ఇది చూస్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలన ఎలా ఉందో అర్థమవుతుందని తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా అక్కడ ఆంధ్రప్రదేశ్‌ మూలాలే ఉంటున్నాయని ఆరోపించారు. ఇంత జరుగుతుంటే ప్రభుత్వ నిఘా వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో వరి కంటే గంజాయి సాగే ఎక్కువగా అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌, గంజాయి పట్టుబడినపుడు.. ఆ నిందితుల వెనుక అధికార పార్టీ నాయకుల అనుచరులు, కార్యకర్తలే ఉంటున్నారన్నారు. మత్తుపదార్థాల వినియోగంతోనే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు. తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో గంజాయి ముఠాలు ఉన్నాయని, ఇప్పటికైనా పోలీసులు వాటిని నిలువరించకపోతే యువత భవిత పాడవుతుందని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు