ఇలాగైతే పనులు చేయించలేం!
గార మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం ఎంపీపీ గొండు రఘురాం అధ్యక్షతన బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది.
సమస్యలపై చర్చిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
గార, న్యూస్‌టుడే: గార మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం ఎంపీపీ గొండు రఘురాం అధ్యక్షతన బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా వైకాపాకి చెందిన కొర్లాం పంచాయతీ సర్పంచ్ కె.శ్రీహరిరావు, తదితరులు మాట్లాడుతూ ‘జగనన్న కాలనీల్లో చేపడుతున్న ఇళ్లకి ప్రభుత్వం రూ.లక్షా 80 వేలు చెల్లిస్తుంది. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రభుత్వ భవన నిర్మాణాలు చేపడుతున్నవాటికి మాత్రం పాత ధరల ప్రకారం చెల్లింపులు చేయడంతో నష్టం వస్తోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలి. లేకుంటే పనులు చేయించలేం. నిలిపివేస్తాం. దీనిపై తీర్మానం చేయండి.’ అని పలువురు సభ్యులు స్పష్టం చేశారు. మిగిలినవాళ్లు సైతం దానికి ఏకీభవించారు. అనంతరం గ్రామాల్లోని వివిధ సమస్యలపై చర్చించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Train Accident: చనిపోయాడనుకొని ట్రక్కులో ఎక్కించారు.. రైలు ప్రమాద ఘటనలో దారుణం
-
Crime News
Road Accident: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురి దుర్మరణం
-
India News
Indian Railway: కొల్లం-చెన్నై ఎక్స్ప్రెస్ రైలు బోగీలో పగుళ్లు
-
Ts-top-news News
Yadadri: యాదాద్రిలో భక్తులకు బ్యాటరీ వాహన సేవలు
-
India News
Ashwini Vaishnaw: రెండు రోజులు ఘటనా స్థలిలోనే.. కార్మికుల్లో ఒకడిగా కేంద్రమంత్రి వైష్ణవ్
-
Politics News
Nara Lokesh: మేనల్లుడూ మేనమామా ఇద్దరూ దోపిడీదారులే: నారా లోకేశ్