logo

రైతులకు పంటలపై అవగాహన కల్పించాలి

నీటి లభ్యత ఆధారంగా వేసుకోవాల్సిన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు.

Published : 30 Mar 2023 03:33 IST

సుజాతను అభినందిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, తదితరులు

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: నీటి లభ్యత ఆధారంగా వేసుకోవాల్సిన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ సలహామండలి సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి చెల్లింపులు వేగవంతంగా జరిగాయన్నారు. విత్తనాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజరు, వ్యవసాయశాఖ, నీటిపారుదలశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. ఎరువుల అవసరాలను గుర్తించి అందుకు తగిన విధంగా సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. సలహామండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీకేల్లో రైతులతో చర్చించాలన్నారు. ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ పొంది ఎన్‌.జి.రంగా విశ్వవిద్యాలయంలో మిల్లెట్్స-2023 అవార్డు అందుకున్న ఎన్‌.సుజాతను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కె.శ్రీధర్‌, సలహామండలి ఛైర్మన్‌ నేతాజీ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు పి.జయంతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని