logo

గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం: ఎస్పీ

జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ జి.ఆర్‌.రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు.

Updated : 30 Mar 2023 05:40 IST

మాట్లాడుతున్న ఎస్పీ రాధిక

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ జి.ఆర్‌.రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, నేరాల నియంత్రణపై జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కేసుల్లో గతంలో అరెస్టయినవారిలో మార్పు రాకుంటే వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వ్యాపార సముదాయాలు, బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అదనపు ఎస్పీ టి.పి.విఠలేశ్వర్‌, ఎస్‌బీ డీఎస్పీ ఎస్‌.బాలరాజు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


నిఘా పెంచండి

కలెక్టరేట్(శ్రీకాకుళం): మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల విక్రయాలపై నిఘా పెంచాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జాయింట్ యాక్షన్‌ ప్లాన్‌ అమలుపై సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల గోడలపై టోల్‌ ఫ్రీ నంబరు 14500ను ప్రదర్శించాలని సూచించారు. ఇందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని చెప్పారు. మద్యం దుకాణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మైనర్లకు మద్యం, పొగాకు, గంజాయి విక్రయించకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ జి.ఆర్‌.రాధిక, అదనపు ఎస్పీ విఠలేశ్వర్‌, ఎస్‌బీ డీఎస్పీ బాలరాజు, అటవీశాఖ అధికారి నిషాకుమారి, సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కిశోర్‌, వాణిజ్యపన్నులశాఖ అధికారిణి రాణిమోహన్‌, తదితరులు పాల్గొన్నారు.          

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని