logo

ఆదిత్యుని ఆదాయం రూ.50.10 లక్షలు

అరసవల్లి సూర్యనారాయణ ఆలయంలోని హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు.

Published : 30 Mar 2023 03:33 IST

హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న సిబ్బంది

అరసవల్లి, న్యూస్‌టుడే: అరసవల్లి సూర్యనారాయణ ఆలయంలోని హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఈ నెల 29 వరకు 44 రోజులకు రూ.50,10,437 ఆదాయం సమకూరినట్లు ఈవో వి.సూర్యప్రకాశ్‌ తెలిపారు. అందులో నోట్ల రూపేణా రూ.48,11,987, చిల్లర రూపంలో రూ.1,98,450 వచ్చినట్లు చెప్పారు. దీంతో పాటు 104 గ్రాముల బంగారం, 2 కిలోల 200 గ్రాముల వెండి, అమెరికా డాలర్లు 52 వచ్చాయన్నారు. కార్యక్రమంలో జిల్లా దేవాదాయ, ధర్మాదాయశాఖ కార్యాలయ సూపరింటెండెంట్‌  బి.వి.వి.ఆర్‌. ప్రసాద్‌ పట్నాయక్‌, ఆలయ అనువంశిక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు, ప్రధానార్చకులు శంకర శర్మ, ఆలయ పాలకమండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని