logo

క్రీడాధికారిగా నియామకం వాసుదేవరావు

అథ్లెటిక్స్‌లో జాతీయస్థాయిలో సత్తా చాటిన నరసన్నపేటకు చెందిన వారణాశి వాసుదేవరావు క్రీడాధికారిగా ఉన్నత బాధ్యతలు పొందారు.

Published : 31 Mar 2023 05:52 IST

నరసన్నపేట, న్యూస్‌టుడే: అథ్లెటిక్స్‌లో జాతీయస్థాయిలో సత్తా చాటిన నరసన్నపేటకు చెందిన వారణాశి వాసుదేవరావు క్రీడాధికారిగా ఉన్నత బాధ్యతలు పొందారు. జోధ్‌పూర్‌లోని ఐఐటీలో వాసుదేవరావు క్రీడాధికారిగా నియమితులయ్యారు. ఈమేరకు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ రిజిస్ట్రార్‌ హరి ఓం యాదవ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వాసుదేవరావు నాగార్జున విశ్వవిద్యాలయంలో వ్యాయామవిద్యలో పీహెచ్‌డీ… పూర్తి చేశారు. అథ్లెటిక్స్‌లో జాతీయస్థాయిలో పలు మార్లు ప్రథమస్థానం పొందారు. ప్రస్తుతం ఐఐటీ తిరుపతిలో వ్యాయామవిద్య శిక్షకుడిగా పనిచేస్తున్నారు. వాసుదేవరావు తండ్రి గణేష్‌ నరసన్నపేట మార్కెట్‌ వీధిలో చిరు వ్యాపారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని