logo

జీవనోపాధుల మెరుగుకే..!

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వాలు పలు పథకాలు అందిస్తున్నాయి. పొదుపు సంఘాలకు ప్రభుత్వాలు అందిస్తున్న ఆర్థిక చేయూత ప్రగతిపై ఆరాతీసేందుకు కేంద్రం దృష్టి సారించింది.

Published : 31 Mar 2023 06:05 IST

మహిళా సంఘాల ప్రగతి సమీక్షకు లఖ్‌పతి దీదీ యాప్‌

మహిళా సంఘాల సభ్యులు

కవిటి, న్యూస్‌టుడే: మహిళల అభ్యున్నతికి ప్రభుత్వాలు పలు పథకాలు అందిస్తున్నాయి. పొదుపు సంఘాలకు ప్రభుత్వాలు అందిస్తున్న ఆర్థిక చేయూత ప్రగతిపై ఆరాతీసేందుకు కేంద్రం దృష్టి సారించింది. ఈ మేరకు తాజాగా ‘లఖ్‌పతి దీదీ’ యాప్‌ అమలులోకి తెచ్చింది.

ప్రామాణిక అంశాల గుర్తింపు..: జాతీయ జీవనోపాధుల మిషన్‌ ఆధ్వర్యంలో లఖ్‌పతి దీదీ యాప్‌ రూపొందించారు. కేంద్రం నూతనంగా అమలులోకి తెచ్చిన యాప్‌లో దశలవారీగా మహిళా సంఘాల ప్రామాణిక అంశాలు గుర్తిస్తూ పనితీరు నమోదు చేస్తున్నారు. యాప్‌లో సంఘాల ప్రగతి ఏమేరకు సాధించారు, లక్ష్యసాధనలో మెరుగు, తదితర అంశాలపై నమోదు చేస్తారు. ప్రధానంగా పథకాలు, రుణాలు మంజూరు చేసిన అనంతరం నిర్దేశితకాలంలో లక్ష్యసాధనలో ఫలితాలు ప్రామాణికంగా తీసుకుంటారు. ఫలితాల ఆధారంగా తదుపరి మరింత అభ్యున్నతి, ప్రగతి సాధించేందుకు భవిష్యత్తు కార్యచరణ రూపొందించనున్నారు.

సంఘాల పనితీరుపై ఆరా..: జిల్లాలో 48,961 స్వయం సహాయకసంఘాలున్నాయి. వీటిలోని మహిళలు ఇంతవరకు వివిధ పథకాలు, రుణాలు పొందినవారే. సంఘాల్లో సభ్యులుగా ఎప్పుడు చేరారు, పథకాలు, రుణాలు ఎప్పుడు, ఎంతెంత పొందారు. సంఘాల్లో చేరక ముందు వారి ఆర్థికపరిస్థితి ఎలా ఉంది, రుణాలు పొందిన అనంతరం ఎంతమేర ప్రగతి సాధించారు, స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పిన నేపథ్యంలో పెట్టుబడులు, ఆదాయ, వ్యయాలతోపాటు పలు ఆర్థిక అంశాలపై ఆరాతీస్తున్నారు.


ఆర్థికపుష్టి పెంపొందించేందుకు..
-డి.విద్యాసాగర్‌, పీడీ, డీఆర్‌డీఏ 

యాప్‌లో వివరాలు నమోదు మహిళల జీవన విధానంలో ఆర్థికపుష్టి పెంపొందించేందుకు దోహదపడుతుంది. ఈ మేరకు నమోదు అంశాలపై వీవోఏలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల అభ్యున్నతికి సరికొత్త ప్రణాళికలు రూపొందించేందుకు ఫలితాలు దోహదపడనున్నాయి.

జిల్లా వివరాలు:
జిల్లాలో గ్రామ సంఘాలు: 1286
స్వయం సహాయక సంఘాలు: 48,961
మొత్తం సభ్యులు: 5,58,703

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని