logo

విద్వేషాలు సృష్టించేందుకు వైకాపా కుట్ర: తెదేపా

ప్రజల్లో విద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు వైకాపా కుట్ర పన్నుతుందని తెదేపా నేతలు ఆరోపించారు. టెక్కలిలో గురువారం నెలకొన్న ఫ్లెక్సీల వ్యవహారంపై నిరసన తెలిపారు.

Published : 31 Mar 2023 06:05 IST

ఫ్లెక్సీలపై అంటించిన గోడపత్రికలు

టెక్కలి, న్యూస్‌టుడే: ప్రజల్లో విద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు వైకాపా కుట్ర పన్నుతుందని తెదేపా నేతలు ఆరోపించారు. టెక్కలిలో గురువారం నెలకొన్న ఫ్లెక్సీల వ్యవహారంపై నిరసన తెలిపారు. అంబేడ్కర్‌ కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించి స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 26న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదినం సందర్భంగా టెక్కలిలో తెదేపా నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఫొటోతో కూడిన శ్రీరామనవమి గోడపత్రికలు పెద్దఎత్తున అతికించారు. ప్రజల్లో విద్వేశాలు రెచ్చగొట్టడం కోసమే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతుందని తెదేపా ఆరోపించింది. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరిరావు, హనుమంతు రామకృష్ణ, రాము, దమయంతి, లవకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ కూడలిలో  తెదేపా శ్రేణుల మానవహారం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని