logo

హైందవ ధర్మాన్ని అనుసరించడమే పరిరక్షణకు మార్గం

హైందవ ధర్మం ఎంతో ప్రాచీనమైంది. పాశ్చాత్య దేశాలు సైతం ఇక్కడి ధర్మసూత్రాలను అనుసరిస్తుండటం గొప్ప విషయం.

Published : 26 May 2023 05:53 IST

అనుగ్రహభాషణం చేస్తున్న కమలానంద భారతి స్వామి

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ‘హైందవ ధర్మం ఎంతో ప్రాచీనమైంది. పాశ్చాత్య దేశాలు సైతం ఇక్కడి ధర్మసూత్రాలను అనుసరిస్తుండటం గొప్ప విషయం. హైందవ ధర్మ పరిరక్షణకు దానిని అనుసరించడమే మార్గమని’ కృష్ణా జిల్లా గన్నవరంలోని భువనేశ్వరి పీఠం పీఠాధిపతి కమలానంద భారతి స్వామి అన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన గురువారం పురుషోత్తపురంలోని శిర్డీ సాయి మందిరం, బెల్లుపడలో త్రినాథ ఆలయాన్ని సందర్శించారు. భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. ఇచ్ఛాపురం ప్రాంతంలో చక్కటి ఆధ్యాత్మిక ఆదరణ ఆనందాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. పిల్లలకు హైందవ ధర్మ గొప్పదనాన్ని వివరిస్తే భావి పౌరులుగా ఉత్తమ సమాజానికి దోహదపడతారని సూచించారు. పుష్పగిరి సాయినాథ మందిరంలో ధర్మకర్త ఉప్పాడ కృష్ణసాయి, పలువురు భక్తులు స్వామికి పాదపూజ చేశారు. బెల్లుపడ కొండపై గ్రామపెద్దలు, యువత, మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికి ఆశీర్వాదం అందుకున్నారు. తెన్నేటి తేజేశ్వరశర్మ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని